లంచ్ తర్వాత నిద్ర ముంచుకొస్తుందా? ఈ టిప్స్ తో చెక్ పెట్టేయండి!!
చాలామందికి మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్రముంచుకొస్తుంది.
హాయిగా బెడ్ పైన ఒక మంచి కునుకేస్తే ఎంత బావుంటుంది అనుకుంటారు. 
ఇంట్లో అయితే అలానే ఎంచక్కా గుర్రుపెట్టి నిద్రపోవచ్చు 
కానీ ఆఫీసులోనో, ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడో అలా చేయలేం కదా!
అందుకే మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోండి 
లంచ్ టైములో దోశ, అన్నం, పొటాటో వంటివి అవాయిడ్ చేయండి 
కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ని గుడ్లు, పండ్లు, నట్స్ వంటి ప్రోటీన్ ఫుడ్స్ తో రీప్లేస్ చేయండి
బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్స్ తిన్నా నిద్ర మత్తుగా ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళకపోవడం బెటర్ 
వాటికి బదులు సలాడ్స్, బాయిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ చికెన్ ప్రిఫర్ చేయొచ్చు అని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు