పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ పదార్థాలను తినిపించండి..!

చిన్న పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటారు.
ముఖ్యంగా పరీక్షల సమయంలో వారి మెదడు చురుగ్గా ఉండి చదివింది గుర్తుండిపోవాలంటే వీటిని కచ్చితంగా తినిపించాలట.
డార్క్ చాక్లెట్‌లో కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్ ఉన్నందున మెమరీ పవర్‌ను పెంచుతాయి.
బాదంపప్పును ప్రతి రోజూ తినడం వల్ల ఆలోచనా శక్తి పెరగడంతోపాటు ఆరోగ్యంగా ఉంటారు.
బ్లూబెర్రీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
గుమ్మడి గింజలల్లో మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ ఉండి శరీరానికి పోషకాలు అందుతాయి. వీటిని తింటే పిల్లలు చురుగ్గా ఉంటారు.