iPhone 14 ధర, ఫీచర్స్ ఇవే..

‘iPhone 14’ ను ఆపిల్ కంపెనీ 'ఫార్ అవుట్' ఈవెంట్‌లో బుధవారం ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది.
దీనిలో మొత్తం నాలుగు వేరియంట్‌లు ఉన్నాయి. అవి iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max. 
క్రాష్-డిటెక్షన్ ఫీచర్‌తో, డ్యూయల్ సిమ్ (నానో-సిమ్, ఇ సిమ్)తో వస్తోంది. 20 గంటల వీడియో ప్లేబ్యాక్ టైం వస్తుందని కంపెనీ పేర్కొంది.
అత్యవసర సమయాలలో ఆటోమెటిక్‌గా డయల్ చేయడానికి ఉపయోగపడుతుంది.
6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే. ఫ్లాట్-ఎడ్జ్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ కలిగి ఉంది.
డాల్బీ విజన్‌, 1200నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, సపోర్టును అందిస్తుంది. ముందు వైపు సిరామిక్ షీల్డ్ మెటీరియల్, IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్.
బ్యాక్ సైడ్ 12-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌. ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా. A15 Bionic SoC, iOS 16 ద్వారా ఫోన్ పనిచేస్తుంది.
సినిమాటిక్ మోడ్‌ 4Kలో 30fpsలో, 4Kలో 24fpsలో వీడియో రికార్డింగ్. ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి బయోమెట్రిక్ ఫేస్ ID ఉంది.
ఇండియాలో iPhone 14 ప్రారంభ ధర రూ. 79,900. బ్లూ, మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, రెడ్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
iPhone 14 ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతాయి. iPhone 14 సెప్టెంబర్ 16 నుంచి అమ్మకానికి ఉంటుంది.