ఏడుపు వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
మనిషి ఒక్కోసారి ఏడవటం, నవ్వటం అనేది ఒక సాధారణ మానవ చర్య. అయితే నవ్వుతూ సంతోషంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిదని చాలా మంది అంటుంటారు.
అయితే ఏడుపు కూడా మన శరీరానికి, మనసుకి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారి ఏడుస్తేనే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. ఇక్కడ ఏడుపు వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే కన్నీళ్లు మూడు రకాలుగా ఉంటాయట. ఏడవడం వల్ల ఒత్తిడి తగ్గి అనారోగ్య సమస్యల నుండి రక్షించుకోవచ్చు.
ఎక్కువసేపు ఏడవడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మంచి అనుభూతిని కల్పించే హర్మోన్లు. ఇవి శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
అలాగే ఏడుపు కారణంగా మెదడుపై ప్రభావం పడకుండా.. శరీరం కూడా మెరుగ్గా పని చేస్తుందట.
చాలా మంది సంతోషంగా, భయంగా లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏడుస్తారు. అలా చేయడం వల్ల బాధ తగ్గి సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే అలా అని ఎక్కువగా ఏడవకూడదు.