తెల్లగా ఉండే ఈ ఆహారాల్ని తీసుకోవడం వల్ల డేంజర్లో పడ్డట్టే.. అవేంటంటే..
ఆహారం, డ్రింక్స్‌లో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాల్ని శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అయితే కొన్ని వైట్ ఫుడ్స్ తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి కిడ్నీలకు ప్రమాదం. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
NHI నివేదిక ప్రకారం క్యాబేజీ, క్యాలీఫ్లవర్ని యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు తినకూడదు. ఈ కూరగాయల్లో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది.
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు.. ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే.. పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.
పుట్టగొడుగుల్లో కూడా ప్యూరిన్ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో, యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు వీటిని మితంగా తీసుకుంటే బెస్ట్ అంటున్నారు నిపుణులు.
వైట్ బ్రెడ్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే ప్రమాదముంది. దీనిని ఎక్కువ తింటే బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.
తెల్ల చక్కెరతో పాటు షుగరీ డ్రింక్స్, షుగరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకూడదంటున్నారు నిపుణులు. చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే ప్రమాదముంది.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిపై ప్రభావం చూపుతుంది. దీంతో, కీళ్ల నొప్పులు ఎక్కువయ్యే ప్రమాదముంది. అందుకే వైట్ సాల్ట్‌ని మానేయండి.