బాడీలో ఐరన్ తగ్గిందా.. అయితే ఈ ఆహారాలతో ఈ సమస్యకు చెక్..

మన శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజంగా ఐరన్ పని చేస్తుంది. అయితే ఐరన్ లోపం ఉండటం వల్ల హిమోగ్లోబిన్ తగ్గడం, రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఐరన్ అనగానే పాలకూర, తోటకూర లాంటివి మాత్రమే చాలా మందికి గుర్తుకు వస్తాయి. కానీ కొన్ని ఇతర ఆకుపచ్చ కూరగాయల్లోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఐరన్‌ను పెంచే ఆహారంలో ఆకు కూరలు ఎప్పుడూ మందు వరసలో ఉంటాయి. వీటితో పాటు నిమ్మకాయను కూడా ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది.
అలాగే టమాటోలో లైకోపీన్, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకుపచ్చ కూరగాయలలో ఉండే పోషకాల మాదిరిగానే ఐరన్‌ను పెంచుతుంది.
ఐరన్ లోపంతో బాధపడేవారు ఆహారంలో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.
అల్లం, వెల్లుల్లి రుచిని పెంచడమే కాకుండా ఐరన్ శోషణను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చేప, మాంసం, లివర్, చికెన్‌లతో పాటు పప్పు ధాన్యాలు, పాలకూర, బీన్స్, క్వినోవా, తృణ ధాన్యాలు, సిట్రస్ పండ్లలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది.