చలికాలం రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినాలి

శీతాకాలం వచ్చిందంటే చాలు చాలామంది బద్దకంగా ఉంటారు. ఏ పని చేయలన్నా అంతగా ఆసక్తి చూపించరు.
అయితే రోజంతా ఎనర్జిటిక్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెప్తున్నారు.
ఉదయం వోట్స్‌ను తినడం వల్ల ఇందులోని పోషకాలు మీరు రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండటానికి సహాయపడతాయి.
అరటిపండ్లలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మనల్ని శక్తివంతంగా ఉంచి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి.
ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఐరన్ ఉన్నందున పొద్దున్నే మొలకలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదు. అందుకే వీటిని ప్రతి రోజూ తినాలి.
క్వినోవాలో విటమిన్లు, ఖనిజాలు, పుష్కలంగా ఉండి మనకు మంచి ఫలితాలను అందచేస్తాయి.