కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచివని అతిగా తాగేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..

కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని సీజన్‌తో సంబంధం లేకుండా తాగేస్తుంటారు.
అయితే వీటిని తీసుకోవడం శరీరానికి అనేక లాభాలు ఉన్నప్పటికీ అతిగా తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరి నీళ్లలో పొటాషియం, మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్స్ ఉండటం వల్ల అతిగా తీసుకుంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.
అలాగే వీటిల్లో మోనోశాక రైడ్లు, ఒలిగోశాక రైడ్లు, పాలియోల్స్ ఉంటాయి కాబట్టి అతిగా తీసుకోవడం వల్ల విరేచనాలు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయట.
మధుమేహం ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగితే చక్కెర స్థాయిలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా షుగర్ చికిత్స తీసుకునే వారు తీసుకోకుండా ఉండటం మంచిది.
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అలెర్జీ వస్తుంది. దద్దుర్లు, దురద వాపు, వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యానికి మంచివని అతిగా తీసుకోకుండా అప్పుడప్పుడు మాత్రమే తాగాలి.