పాలు ఎక్కువగా తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

చాలా మంది ఆహారం తినాలనిపించకపోతే పాలు ఆరోగ్యానికి మంచివని ఎలాంటి సమయంలో అయినా సరే పాలను వేడి చేసి తాగుతుంటారు.
పాలల్లో ఉండే మినరల్స్, ప్రోటీన్లు మన శరీరానికి మంచివని కొంత మంది పాలను ఎక్కువగా సేవిస్తుంటారు.
అయితే మొతాదుకు మించి పాలను తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
పాలు అధికంగా తాగితే వాంతులు, జీర్ణం కాకపోవడం, ఎముకలు బలహీన పడటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
పాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అలెర్జీలు వస్తాయి. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
పాలల్లో అధికంగా కాల్షియం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.