ఈ సీజన్‌లో చర్మంపై దురద వస్తుందా.. అయితే ఈ పదార్థాలు ఉపయోగించాల్సిందే?
శీతాకాలం శరీరంపై దుమ్ము, దూళి పడితే కొంత మందికి చర్మంపై దురద, పగుళ్లు వంటివి వస్తాయి.
చాలా మందికి చర్మం పొడి బారటం వల్ల కూడా దురద, దద్దుర్లు ఏర్పడి పలు ఇన్‌ఫెక్షన్లు ఎదురవుతాయి.
అలాంటి వారు ఈ పదార్థాలతో ఆ సమస్యల నుండి బయటపడొచ్చు.
కొబ్బరి నూనె ఎర్రగా మారిన చోట్ల, దద్దుర్లు, ఉన్న దగ్గర రాసుకోవాలి. ఇందులో ఉన్న యాంటీ ఫంగల్ గుణాలు దురద తగ్గి చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
కలబంద గుజ్జును దురద ఉన్న చోట్ల రోజుకు రెండుసార్లు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
రెండు స్పూన్ల నిమ్మరసంలో కొద్దిగా నీళ్లు కలిపి దద్దుర్లు ఉన్న ప్రదేశంలో మెల్లగా పూయాలి.
దురద మరి ఎక్కువగా వస్తే ఐస్ క్యూబ్‌లను కాటన్ క్లాత్‌లో ముంచి దురద ఉన్న చోట రాసుకోవాలి.