లిప్ స్టిక్ లేకున్నా మీ పెదాలు ఎర్రగా అందంగా కనిపించాలా..
అందంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.
ఇక కొంత మందికి లిప్స్‌తో అందం వస్తుంటది. దీంతో వారు వాటిని అందంగా తీర్చిదిద్దుకుంటారు.
అధిక ధరతో కెమికల్స్‌తో కూడిన లిప్ స్టిక్స్ కొని వాడుతుంటారు. కానీ అవి ఏవీ లేకుండా వంటింటి చిట్కాలతో పెదాలు ఎర్రగా ఎలా మార్చుకోవాలో చూద్దాం.
వారానికి రెండు సార్లు బీట్ రూట్ ముక్కలని, పెదాలపై మర్దన చేయడం వలన నల్లటి పెదాలు రెడ్‌గా మారే అవకాశం ఉంది.
రాత్రి పడుకునే ముందు పెదవులపై పాల మీగడ రాసుకొని, ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల పొడిబారకుండా ఉంటాయి.
నిమ్మరసంలో పంచదార, కొబ్బరినూనెను కలిపి పెదవులపై 15 నిమిషాలు పెదవులను మర్దన చేసుకొని, ఆ తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవడం వల్ల నలుపు మృతకణాలు తొలగిపోయి పెదవులు ఎర్రగా, ఆరోగ్యంగా, అందంగా కనబడతాయి