ఆవలిస్తే కన్నీరు ఎందుకు వస్తుందో తెలుసా?

ఆవలింత రావడం అనేది చాలా సహజం.
నిద్ర లేకుండా వర్క్ చేసిన సమయంలో మనకు ఎక్కువగా ఆవలింతలు వస్తుంటాయి.
అయితే ఆవలింత వచ్చినప్పుడు, మనకు తెలియకుండానే మన కళ్లలో నుంచి వాటర్ వస్తుంటాయి.
ఎందుకంటే.. మన కనుబొమ్మల దిగువన లాక్రిమల్ గ్రంథులు ఉంటాయి.
ఇవి రోజంతా నెమ్మదిగా నీటిని ఉత్పత్తి చేస్తాయి.. అవే కన్నీరు అవుతాయి.
ఆవలించినప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీరు గ్రంధుల నుంచి విడుదలై కళ్లల్లో చేరుతుంది.
మీరు ఆవలించినప్పుడు మీ ముఖ కండరాలు సంకోచిస్తాయి.
ఆ సమయంలో కన్నీటి గ్రంధులపై ఒత్తిడి పడి, ఆ ఒత్తిడి వల్ల గ్రంధులను పిండినట్టు అవుతుంది.
అప్పుడు అందులోని ఎక్కువ నీరు కళ్లల్లోకి చేరుకుంటాయి.. అందుకే ఆవలించినప్పుడు కళ్లలోకి నీరు వస్తుంది