పెళ్లిలో సప్తపది ఎందుకు వేస్తారో తెలుసా?

హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లిలో వధూవరులచేతా సప్తపది వేయిస్తారు.
కానీ, మనలో చాలా మందికి అసలు సప్తపది ఎందుకు వేయిస్తారో.. దాని అర్థమేంటో తెలియదు.
కానీ, మనలో చాలా మందికి అసలు సప్తపది ఎందుకు వేయిస్తారో.. దాని అర్థమేంటో తెలియదు.
అయితే, సప్తపదిలో ఒక్కో అడుగుకు ఒక్కో అర్థం ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి అడుగు: ఏ కర్మలోనైనా ఒకరికొకరు అండగా ఉంటాం.
రెండవ అడుగు: వ్యక్తిగత, కుటుంబ గౌరవాలను కాపాడుకుంటాం.
మూడవ అడుగు: ఒకరి కష్టసుఖాలను మరొకరం పంచుకుంటాం.
నాలుగో అడుగు: సంతానాన్ని కాపాడుకుంటాం.
ఐదవ అడుగు: ఏ విషయంలో దాపరికాలు లేకుండా ఉంటాం.
ఆరవ అడుగు: ఎలాంటి పరిస్థితుల్లోను ఒకరి చేయి మరొకరం వీడము.
ఏడవ అడుగు: ధర్మం, అర్థ, కర్మ విషయాలలో ఒకరి ఆదేశాలను మరొకరం పాటిస్తాం.