భర్తను భార్య పేరు పెట్టి ఎందుకు పిలవ కూడదో తెలుసా?

పెళ్లి తర్వాత చాలామంది మహిళలు తమ భర్తను పేరు పెట్టి పిలవరు.
ఇక అప్పట్లో భర్తను పేరు పెట్టి పిలవడమే మహా పాపంగా పరిగణించేవారు.
అయితే ఇలా భర్తను పేరు పెట్టి పిలవక పోవడానికి ఒక కారణం ఉందంటున్నారు పండితులు.
భర్తను పేరు పెట్టి పిలిస్తే ఆయుష్ క్షీణం అని భావించేవారంట.
భర్త.. భార్య కన్న పెద్దవాడు, మన హిందు సాంప్రదాయాల ప్రకారం పెద్దవారిని చిన్నవారు పేరు పెట్టి పిలిస్తే ఆయుష్ తగ్గుతుంది అంటారు.
అలాగే పెద్దవారిని గౌరవించడం అనేది మన సంప్రదాయం, అందుకే భార్య భర్త కంటే చిన్నది కాబట్టి భర్తను పేరు పెట్టి పిలవకూడదు.