బెల్లం కలిపిన పాలు తాగితే ఏమవుతుందో తెలుసా..?
బెల్లం కలిపిన పాలు తాగటం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగా నిరోధక శక్తిని పెంచె దివ్య ఔషధ పదార్థాలు ఎన్నో ఇందులో ఉంటాయి
బెల్లం కలిపిన పాలల్లో ఐరన్, జింక్, క్యాల్షియం, పొటాషియం, ప్రోటిన్స్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. కనుక పంచదారకు బదులుగా పాలల్లో బెల్లం కలుపుకోవడం మంచిది
ప్రతిరోజు బెల్లం పాలు తాగితే జీర్ణసమస్యలు మెరుగుపడటమే కాకుండా.. కడుపులో ఏర్పడే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా మలవిసర్జన కూడా సాఫీగా జరుగుతుంది
ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరు రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. బెల్లం పాలు తీసుకుంటే రక్త హీనత తగ్గి.. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది
బరువు తగ్గాలి అనుకునే వారు రోజు బెల్లం కలిపిన పాలు తాగటం వల్ల అందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలో ఏండే అధిక కొవ్వును తగ్గిస్తాయి