పెళ్లిల్లో ఈ పద్ధతులను పాటిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

వివాహాల్లో చాలా సాంప్రదాయాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో పెళ్లి జరిపిస్తారు.
అయితే ముఖ్యంగా హిందూ వివాహల్లో కొన్ని సాంప్రదాయాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని హిందువుల నమ్మకం.
పెళ్లి వధువు చేతి నిండా గాజులు ధరించడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందుకే పెళ్లికి వచ్చిన మహిళలకు కూడా చేతినిండా గాజులు ధరిస్తారు.
పెళ్లి కూతురి కాళ్లకు మెట్టలు పెట్టుకుంటే రెగ్యులర్ గా పీరియడ్స్ రావడానికి ఉపయోగపడుతుంది. అందుకే వధువు కాళ్లకు మెట్టలు పెడతారట.
పెళ్లి జరిగిన తర్వాత వివాహితలు నుదుటిన కుంకుమ పెట్టుకోవడం హిందూ సాంప్రదాయాల్లో ముఖ్యమైనది. ఇలా చేస్తే వారిలో బీపీ కంట్రోల్‌లో ఉండటమే కాకుండా సెక్స్ డ్రైవ్ పెరుగుదలకు సహాయపడుతుంది.
అలాగే పెళ్లి తంతు ముగిసిన తర్వాత బిందెలో ఉంగరాలు వేయించి నవ దంపతులతో ఆటలాడిస్తారు. ఎవరు ఉంగరం ముందుగా తీస్తే ఇంట్లో వారి పెత్తనం ఎక్కువగా ఉంటుందని అర్థం.
కొంతమంది పెళ్లి కూతురు చేతికి పదునైన కత్తిని కడతారట. ఎవరైనా ఇబ్బంది పెడితే వారి బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి అలా చేస్తారు.
మరి కొంత మంది నవ వధువు మొదటిసారి అత్తారింట్లో అడుగుపెట్టే ముందు బియ్యం ఉంచిన గిన్నెను కాలితో తన్నుతారు. అలా చేయడం వల్ల అత్తారింట్లో సిరిసంపదలు కలగుతాయి.