2023-24 బడ్జెట్‌లో పన్ను స్లాబ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కొత్త బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట కలిగిందనే చెప్పవచ్చు. పన్ను స్లాబ్ రేట్లు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చుతున్నాయో చూద్దాం.
ఈ బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును రూ.2,50,000 నుంచి రూ. 3 లక్షలకు పెంచారు.
కొత్త పన్ను విధానంలో రిబేటు పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. దీంతో రూ.7 లక్షల వార్షికాదాయంపై ఎలాంటి పన్ను విధించలేదు.
రూ. 3-6 లక్షల వార్షికాదాయం ఉన్నవారు 5 శాతం, రూ.6-9 లక్షల మధ్య 10 శాతం, రూ. 9- రూ.12 లక్షలు- 15 శాతం, రూ.12 -15 లక్షలు- 20 శాతం, రూ.15 లక్షల కన్నా ఎక్కువ- 30 శాతం పన్నులు చెల్లించాలి.
రూ. 9 లక్షల వేతనం పొందే వారు గతంలో రూ. 60 వేల పన్ను చెల్లించేవారు. కానీ ఇకమీదట రూ. 45 వేలు చెల్లిస్తే చాలు.
సర్‌ఛార్జీని 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. ఫలితంగా అత్యధిక ట్యాక్స్ రేట్ 39 శాతానికి చేరుకుంటుంది.
అలాగే సీనియర్ డిపాజిట్ స్కీమ్ పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు పెంచారు.