సీరియల్ నటీమణుల పారితోషికం ఎంతో తెలుసా..?
వెండి తెరతోపాటు బుల్లితెర నటీమణులకు మంచి ప్రేక్షకాదరణ ఉంటుందనడంలో సందేహం లేదు. నేటి రోజుల్లో ఇంటిల్లిపాది టీవీ సీరియల్స్‌కు అలవాటు పడిపోయారు. అయితే సీరియల్స్ హీరోయిన్ల పారితోషికాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కార్తీక దీపంతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ ప్రేమి విశ్వనాథ్. వంటలక్కగా ప్రతి ఇంటిలో స్థానం సంపాదించుకున్న ఈమె రోజుకు రూ.25 వేల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
సుహాసిని. ఈమె తెలుగు, తమిళ సినిమాలతోపాటు సీరియళ్లలోనూ నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. సుహాసిని రోజుకు రూ.20 వేల పారితోషికం తీసుకుంటుంది.
నవ్య స్వామి. ఎంతో అమాయకంగా కనిపించే ఈ నటిమణి.. సీరియళ్లతోపాటు ఢీ షోలో కూడా చేస్తోంది. ఈమె రోజు వారి సంపాదన రూ.20 వేలు.
ఆడదే ఆధారం అంటూ ప్రతి ఇంటిని టచ్ చేసిన నటి పల్లవి రామిశెట్టి. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రజలకు దగ్గరైన పల్లవి రోజుకు రూ.15 వేల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
అచ్చ తెలుగు ఆడపడుచు.. మన ఇంటి అమ్మాయిలా కనిపించే అషికా రోజుకు రూ.12 వేల పారితోషికం తీసుకుంటుంది.
హరిత. సినిమాలతోపాటు తెలుగు సీరియల్స్‌లో నటించే ఈమెకు రోజు రూ.12 వేల రెమ్యునరేషన్ అందజేస్తున్నారు.