ఉల్లికాడలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?
మన శరీరానికి ఉల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఉల్లిపాయలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి.
అలాగే ఈ సీజన్‌లో విరివిగా దొరికే ఉల్లికాడలతో కూడా మంచి ఉపయోగాలున్నాయని నిపుణులు చెపుతున్నారు.
ఉల్లికాడల్లో విటమిన్-C ఉండి చెడు కొలెస్టాల్‌ను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉండేలా చేస్తుంది.
ఫైబర్ జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటివి రాకుండా చేస్తుంది.
విటమిన్-K కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను తగ్గించి ఎముకలను దృడంగా ఉంచుతుంది.
ఈ కాడల్లో యాంటీ బాక్టిరీయల్ లక్షణాలు శ్వాసకోశ వ్యవస్థ, దగ్గు, జలుబు, జ్వరం ఇన్ఫెక్షన్లు వంటివి దరి చేరకుండా కాపాడుతాయి.