నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..!
పూర్వకాలంలో అందరూ కలిసి ఇంట్లో ఒకే చోట కింద కూర్చుని భోజనాలు చేసేవాళ్లు.
టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్ది.. బంధాలు తగ్గిపోయాయి.. డైనింగ్ టేబుల్స్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఎవరికి ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్లు తిని వెళిపోతున్నారు.
అయితే.. నేలపై కూర్చుని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రజయోనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
నేలపై కూర్చోని తినడం కారణంగా జీర్ణక్రియ మెరుగు పడుతుంది
నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారం తక్కువుగా తింటారు. ఇది అధిక బరువును తగ్గించుకునేందుకు సహాయం చేస్తుంది.
నేలపై కూర్చుని భోజనం చేస్తే శరీరం దృఢంగా మారుతుంది.
యురోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమైన కథనం ప్రకారం.. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని వెల్లడైంది.
నేలపై కూర్చోవడం వల్ల సుఖాసన స్థితిలో ఉంటారు. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన లేకుండా భోజనం చేస్తారట.