సోంపు పాలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
పాలలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఫాస్ఫరస్ పాంథోనిక్ యాసిడ్, సెటీనియమ్ లాంటి మూలకాలతో పాటు విటమిన్-ఎ, డీ, బీ6 వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.
సోంపు: ఇందులో విటమిన్-సీ, క్వెర్సెటిన్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇన్ని పోషకాలు ఉన్న సోంపు పాలు తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటంటే..
ఈ సోంపు పాలు పిల్లలు, పెద్దలు తాగితే మెదడు చాలా కాలం పాటు యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాదు పడుకునే ముందు ఈ పాలు తాగితే బ్రెయిన్ షార్ప్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
సోంపు పాలు కండరాలను బలోపేతం చేస్తాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ పాలు తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది.
సోంపు పాలు తాగడం వల్ల అందులో ఉండే ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియంలు ఎముకలను, దంతాలను బలపరచడంలో ఎంతో ఉపయోగపడతాయి.
అంతే కాకుండా పడుకునే ముందు సోంపు పాలు తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. చెంచా సోంపు గింజలు తీసుకుని ఒక గ్లాస్ పాలల్లో వేసి మరిగించుకోవాలి. తర్వాత సోంపు తొక్కు తొలగించి.. టేస్ట్‌కు తగ్గట్టుగా తేనే కానీ, బెల్లం కానీ కలుపుని తాగడమే.