రాత్రి భోజనం చేసిన తర్వాత నడవటం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

ప్రస్తుతం చాలా మంది బిజీ బిజీగా, టెన్షన్ లైఫ్‌ను గడుపుతున్నారు. ఇలాంటి వాళ్లు రాత్రి భోజనం చేయగానే నిద్రపోతారు.
రాత్రి డిన్నర్ తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే రాత్రి ఆహారం తిన్నాక 100 అడుగులు వేస్తే ఎలాంటి ఇబ్బందులు దరిచేరవో తెలుసుకుందాం.
రాత్రి సమయంలో తిన్నాక 2 నిమిషాల నడక కడుపునొప్పి, మలబద్ధకం, అజీర్ణం వంటివి దరిచేరకుండా చేస్తుంది.
ఇలా రోజు చేయడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా సహాయపడుతుంది.
రాత్రిపూట వాకింగ్ శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో ఒత్తిడి, ఉబకాయం భారిన పడకుండా రక్షించుకోవచ్చు.