రోజూ గ్రీన్ ఆపిల్ తింటే ఈ అనారోగ్య సమస్యలన్నీ పరార్..!
ఆకుపచ్చ రంగులో ఉండే గ్రీన్ ఆపిల్‌లో ఎన్నో పోషకాలు విటమిన్లు కలిగి ఉంటాయి.
పుల్లని, తీయని రుచి కలిగి ఉండే ఈ సేపును చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు.
అయితే గ్రీన్ ఆపిల్ కూడా ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటని తాజాగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆపిల్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు జీర్ణ వ్యవస్థ లోపాలను సరిదిద్దడంలో ఎంతగానో మేలు చేస్తాయి.
రక్తంలో కొలెస్ట్రాలను కరిగించడం, రక్తపోటు సమస్యలను పోగోట్టడంతో తోడ్పడుతుంది. దీంతో గుండె జబ్బుల సమస్యలు రాకుండా ఉంటాయి.
థైరాయిడ్ గ్రంధి సమస్యలు, కీళ్ల సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. కాలేయ, పేగు, రొమ్ము క్యాన్సర్ లాంటి జబ్బులు దరిచేరవు..
అలాగే చర్మం కాంతివంతంగా ఉండటమే కాకుండా కాలేయం రక్షణకు ఉపయోగపడుతుంది.
మతిమరుపును తగ్గిస్తుంది. ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చు
కళ్లకింద నల్లటి వలయాలు తొలగిపోతాయి.
జుట్టు పెరుగుదలకు చుండ్రు నివారణకు జుట్టు రాలే సమస్యలు నివారిస్తుంది.
ముఖ్యంగా గ్రీన్ ఆపిల్ తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా, యవ్వనంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి గ్రీన్ ఆపిల్‌ను ప్రతిరోజు వారి ఆహారంలో ఒక గ్రీన్ ఆపిల్ పండును భాగం చేసుకోవడం ఉత్తమం.