డైలీ స్కిప్పింగ్ ఆడితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రతిరోజు స్కిప్పింగ్ ఆడటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
అధిక బరువుతో బాధపడేవారికి స్కిప్పింగ్ చాలా ఉపయోగపడుతుంది.
* శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వు కరిగిపోయి సన్నగా అవుతారు.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
* స్కిప్పింగ్ చేయడం వల్ల ఒక కిలో మీటరు పరుగెత్తిన దాంతో సమానమని చెబుతున్నారు నిపుణులు. డైలీ ఒక గంట పాటు ఆడితే దాదాపు 1600 కేలరీలు కరిగిపోతాయట.
స్కిప్పింగ్ అనేది ఫుల్ బాడీ వర్కవుట్.
స్కిప్పింగ్ వల్ల కో ఆర్డినేషన్, స్టామినా అలాగే ఫోకస్ పెరుగుతాయి.
ఏదైనా వ్యాయామం చేసేముందు 3-5 నిమిషాలు తప్పకుండా స్కిప్పింగ్ చేయండి. దీంతో మీ కండరాలు చాలా స్ట్రాంగ్ అవుతాయంటున్నారు నిపుణులు.