కలబంద వల్ల చర్మానికి, జుట్టుకు కలిగే ఉపయోగాలు తెలుసా?
ఇంట్లో పెరిగే అలోవెరా వల్ల ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఉన్నాయి. అలాగే చర్మం కూడా యవ్వనంగా కనిపిస్తుంది.
చలికాలం చర్మానికి, జుట్టుకు సంబంధించిన సమస్యలు చాలానే తలెత్తుతాయి. అలాంటి సమయంలో కలబందను ఉపయోగించాల్సిందే.
ఈ సీజన్‌లో కొంత మంది చర్మం పొడిబారుతుంది. అలాంటివారు కలబంద గుజ్జును రోజూ ముఖానికి రాసుకుంటే మంచిది.
కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.  రోజూ కలబంద గుజ్జును వాడితే ముఖంపై ఉన్న నల్ల మచ్చలు తగ్గి కాంతివంతంగా ఉంటుంది.
కలబంద గుజ్జును ఫ్రిడ్జ్‌లో ఐస్ క్యూబ్ ట్రేలో పోసి గడ్డకట్టిన తర్వాత ఉపయోగిస్తే ముఖంపై గీతలు దూరం అవుతాయి.
మొటిమలు ఉన్నవారు కలబంద గుజ్జును ప్రతి రోజూ రాసుకోవాలి. దీంతో మొటిమల నుండి ఉపశమనం పొందవచ్చు.
అలోవెరా జెల్‌లో ప్రోటీయాలైటిక్ ఎంజైమ్‌లు ఉంటాయి. దీనిని పొడి జుట్టుకు పెట్టుకుంటే జుట్టు రాలకుండా, పెరుగుదలకు తోడ్పడుతుంది.
ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నందున చుండ్రును తొలగించడానికి సహాయపడుతుంది.