చలికాలం బత్తాయిలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

శీతాకాలం చలి తీవ్రత వల్ల బత్తాయిలను తింటే జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయని భావిస్తుంటారు. 
కానీ, బత్తాయిల వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ సీజన్‌లో బత్తాయిలు తింటే రోగనిరోధక శక్తి పెరిగి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి.
వీటిని జ్యూస్ చేసుకుని తాగితే అజీర్ణం, ప్రేగు కదలికలు, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండటమే కాకుండా రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
బత్తాయిని తినడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
విరోచనాలు, వాంతులు, వికారం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.