పరోటాలు తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

ఈ బిజీ బిజీ జీవితంలో చాలా మంది ఒత్తిడి, అలసటతో వంట చేయకుండా బయట దొరకే పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు.
ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకుని వేడి వేడిగా తింటూ ఎన్నో అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు.
ముఖ్యంగా పరోటాలను చిన్నా పెద్ద ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ వాటిని తినడం వల్ల చాలా ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మైదా పిండిలో పీచు పదార్థం ఉండదు అందువల్ల జీర్ణం అవడానికి అవస్థలు పడాల్సి వస్తుంది. పేగుల్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి.
పరోటాలు తింటే గుండె జబ్బులు, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ.
ముఖ్యంగా మహిళలు పరోటాలు తినడం వలన రొమ్ము క్యానర్స్ వచ్చే ప్రమాదం ఉంది.
మైదా పిండితో తయారు చేస్తారు కాబట్టి ఎక్కువగా తింటే పొట్ట వస్తుంది.
పరోటాలు శరీరంలోని షుగర్ లెవల్స్‌ను పెంచడమే కాకుండా రక్తపోటు సమస్య మరింతగా ఇబ్బంది పెడుతుంది.