ఎండాకాలం వస్తే చాలు రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.
ముఖ్యంగా వేడి, చెమట కారణంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, మెటిమలు, దద్దుర్లు ఏర్పడి ఫేస్ పాడైపోతుంది.
అయితే ఎండాకాలంలో కూడా చర్మం అందంగా మిల మిల మెరవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.
నూనెలో వేయించిన పదార్థాలకు, గరం మసాలా వేసే వంటలకు దూరంగా ఉండటం మంచిది.
అలాగే ఎండకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులతో కొబ్బరి నీళ్లను ఫేస్‌కు అప్ల చేసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
సున్నిపిండిలో ఆయుర్వేద చూర్ణం కలిపి శరీరమంతా రుద్దుకుని స్నానం చేయాలి.
చర్మంపై దుమ్ము ధూళి పడి జిడ్డుగా మారకుండా రోజులో రెండు సార్లు ముఖం కడుక్కుని మాయిశ్చరైజర్‌ను అప్లై చేసుకోవాలి.
వేడిగా ఉందని కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్‌లో నీరు తాగకూడదు. కేవలం కుండలోని నీరు మాత్రమే తాగాలి.
చర్మం అందంగా ఉండాలంటే ఎక్కువగా మజ్జిక, కొబ్బరి నీరు, జ్యూస్‌లు తాగాలి.