చలికాలం గుండెపోటు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే?
ఇటీవల చాలా మంది చిన్నా పెద్ద గుండె పోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు అంతసేపు యాక్టీవ్‌గా ఉన్నప్పటికీ గుండెపోటు కారణంగా సడెన్‌గా మృతి చెందుతున్నారు.
చలికాలంలో వాతావరణంలో మార్పుల వల్ల హార్ట్ ఎటాక్ ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ టిప్స్ పాటిస్తే గుండె పోటు రాకుండా కాపాడుకోవచ్చు.
చలికి భయపడి వర్కౌట్స్ చేయకుండా ఉండకూడదు. వాకింగ్, డ్యాన్సింగ్ వంటివి అయినా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు.
అయితే కొందరు ఎక్కడ పడితే అక్కడ సిగరెట్, బీడి తాగుతుంటారు. చలికాలం స్మోకింగ్ చేయడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మానేయడం మంచిది.
చలికాలం శరీరం వెచ్చగా ఉండాలంటే ఉన్ని దుస్తులు ధరించడం వల్ల పలు ఆనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
సీజన్ బట్టి ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. కూరగాయలు, పండ్లలో కొవ్వు సోడియం ఉన్నవాటిని తీసుకోకుండా జాగ్రత్త పడాలి.
చలికాలం ఎక్కువ నీరు తాగితే యూరిన్ వస్తుందని చాలా మంది తక్కువగా తాగుతుంటారు. అలా చేస్తే గుండె పోటు వచ్చే అవకాశం ఉంది.
ఒత్తిడి వల్ల కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించే యోగాసనాలు చేయాలి. దీంతో బీపీ అదుపులోకి రావడంతో పాటు హార్ట్ ఎటాక్ నుంచి తప్పించుకోవచ్చు.
అలాగే చలిలోనే ఎక్కువ సమయం గడపడం వల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది కాబట్టి బయటకు వెళ్లినప్పుడు శరీరాన్ని మొత్తం కవర్ చేసుకోవాలి.