గొంతులో చేప ముళ్లు ఇరుక్కుందా.. అయితే ఈ టిప్స్‌ను ఫాలో అవ్వాల్సిందే..!

చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు.
చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, కాల్షియంచ ఫాస్పరస్, ఐరన్, జింక్, అయోడిన్ వంటి ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.
ఈ పోషకాలు మెదడు, నాడి వ్యవస్థను, ఎముకులను, కండరాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి.
అయితే.. ఇందులో ఉండే పోషకాల గురించి పక్కన పెడితే.. చాలా మందికి చేపలు తినడం రాదు. ముల్లుతో పాటు తినడంతో ఒక్కోసారి గొంతులో ముళ్లు ఇరుక్కుపోతుంది.
ఇలా గొంతులో ముళ్లు ఇరుక్కున్నప్పుడు ఈ చిట్నాలు పాటిస్తే ఈజీగా ముళ్లు నుంచి ఉపసమనం పొందొచ్చు. అవేంటో చూద్దాం.
గొంతులో చేప ముళ్లు ఇరుక్కున్నప్పుడు పొట్టమీదా గట్టిగా ఒత్తాలి. అలాగే వీపుపై ఒత్తిడి చేయాలి. ఇలా చేసినప్పుడు నోరు తెరిచిపెట్టి ఉంచాలి.
పొడి అన్నాన్ని ముద్దలా చేసి మింగితే ఈజీగా ముళ్లు గొంతు నుంచి లోపలికి వెళ్లిపోతుంది.
అరటిపండును పెద్ద ముక్క తీసుకుని మింగిన ముళ్లు పోతుంది.
బ్రెడ్‌ని నీటిలో నానపెట్టి ఒక పెద్ద స్ఫూన్‌తో తింటే ఈజీగా ముళ్లు గొంతు నుంచి కిందకి జారుతుంది.
సోడా తాగితే కూడా గొంతులో ముళ్లు కరిగిపోతుందట. సోడాలో ఉండే గ్యాస్ గొంతులో ముల్లుపై ఒత్తిడి తెచ్చి అది కరిగిపోయోల చేస్తుంది.