ఉదయం నిద్రలేవగానే ఈ ఐదు పనులు అస్సలు చేయొద్దు..?
ప్రతి రోజు ఉదయం నూతన ఉత్సాహాన్ని నింపుకుని.. మన రోజును కొత్తగా, అందంగా మొదలు పెట్టాలని అనుకుంటాం..
కానీ, ఉదయం లేవగానే మనం చేసే కొన్ని పనుల వల్ల రోజంత డల్‌గా ఉండటమే కాకుండా ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడే అవకాశాలు చాలా ఉన్నాయి.
అలా కాకుండా మన రోజూ మొత్తం సంతోషంగా, యాక్టీవ్‌గా ఉండాలంటే నిద్ర లేచిన వెంటనే చేయకూడని ఐదు పనులు ఏంటో తెలుసుకుందాం..
నిద్ర లేవగానే మొట్టమొదటిగా చేయకూడని పని ఫోన్ చూడటం. చాలా మంది కళ్లు తెరడంతోనే ఫోన్ చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల రోజంతా డల్‌గా ఉంటారు. దీంతో పాటు ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడే అవకాశం ఉంది.
రోజులో అతి ముఖ్యమైన పని టిఫిన్. అల్పాహారాన్ని చాలా మంది స్కిప్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభించకపోగా.. రోజూ మొత్తం తినే ఫుడ్‌పై ఆ ఎఫెక్ట్ చూపిస్తుందంటున్నారు నిపుణులు.
ఏదైనా ముఖ్యమైన పని ఉన్న రోజు చాలా మంది నిద్ర లేవడంతోనే ఆ పని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా నిద్ర లేచాక కాస్త సమయాన్ని మీ కోసం మీరు కేటాయించుకుంటే రోజంతా సంతోషంగా ఉంటారు.
ఆరోగ్య నిపుణుల సలహా మేరకు.. ఉదయం లేవగానే చిన్న చిన్న యోగా చిట్కాలు ట్రై చేయడం వల్ల కూడా.. ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా బలంగా ఉంటారు.
ఇక చాలా మంది తమ రోజును టీ, కాఫీ, పాలు, చక్కెర వంటి పానీయాలతో ప్రారంభిస్తారు. అది మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. వాటికి బదులుగా గ్రీన్ టీ చక్కెర లేకుండా తీసుకుంటే మంచిదని నిపుణుల అభిప్రాయం.
ఇక ఫైనల్‌గా నిద్ర లేచిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అని కంగారు పడకుండా.. ముందు రోజు పడుకునే ముందే మరుసటి రోజు నిద్ర లేవగానే తమ పనుల గురించి షెడ్యూల్ వేసుకున్నట్లయితే ఎటువంటి హడావుడి లేకుండా రోజంతా సాఫీగా సాగుందని నిపుణుల అభిప్రాయం.