నోరూరించే సీతాఫలం... కొనాలంటేనే భయం!!

శీతాకాలం అంటేనే సీతాఫలాలు విరివిగా దొరికే సీజన్
గతేడాది వరకూ సీతాఫలాలు ఎక్కడపడితే అక్కడ చౌకగా దొరికేవి
మార్కెట్లు, సిటీ ఔట్ స్కర్ట్స్ లో అయితే ఒక బుట్టలో పళ్ళన్నీ అటూఇటూగా రూ.100 కి అమ్మేవాళ్ళు
కానీ ఈసారి సీతాఫలాలు ఎంత నోరూరిస్తున్నా కొనాలంటేనే సామాన్యులకి భయమేస్తోంది
అవును మరి, కేజీ రూ.200 చొప్పున సీతాఫలాలు కొనాలంటే సామాన్యులకి భారమే కదా.. అంతలా పెరిగిపోయింది వీటి ధర!!
అయితే, అంత ధరలో అమ్మడానికి కారణం ఇవి మన రాష్ట్రంలో లభించే చిన్న సైజు సీతాఫలాలు కాదు 
మహారాష్ట్రరలోని నాందేడ్, అకోలా నుంచి దిగుమతి చేసిన ఈ పండ్లను హైదరాబాద్ లో అక్కడక్కడా తోపుడుబండ్లు, వ్యాన్లలో పెట్టి అమ్ముతున్నారు