చాణక్య నీతి : తల్లిదండ్రులు చేసే ఈ తప్పులే.. పిల్లలకు శాపాలు?

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలియజేశాడు.
ముఖ్యంగా జీవన విధానంలో తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలను తెలియజేశాడు.
తల్లిదండ్రులు తెలియక చేసే కొన్ని తప్పులు, పిల్లల జీవితాన్ని నాశనం చేస్తాయంట.
అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ చూపని తల్లిదండ్రులు వారికి శత్రువుల వంటి వారంట.
ఏ తల్లిదండ్రులైనా సరే తమ పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తే అలాంటి వారి పిల్లలు త్వరగా చెడిపోతారంట.
పిల్లలు చేసే తప్పులను నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రుల వలన పిల్లలు తప్పుడు దారి పడుతారంట.