క్రిస్టియానో రోనాల్డోతో డేటింగ్ చేసింది ఏడుగురు పెద్ద సెలబ్రిటీలే అని తెలుసా..?
మెర్చే రొమేరో ప్రసిద్ధ పోర్చుగీస్ మోడల్.. రొనాల్డో తో కలిసి 2005 సంవత్సరంలో డేటింగ్ చేసింది. కాగా రోనాల్డో ఆమె కంటే 9 సంవత్సరాలు చిన్నవాడు. కొద్ది రోజులకు వారు విడిపోయారు.
నెరీడా గల్లార్డో - ఆమె పానిష్ మోడల్.. క్రిస్టియానో రొనాల్డోతో 2008లో డేటింగ్ చేసింది. ఆ సమయంలోనే అతను మాంచెస్టర్ యునైటెడ్‌తో ఛాంపియన్స్ లీగ్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత విభేదాల కారణంగా విడిపోయారు.
అంతర్జాతీయ సూపర్ స్టార్ అయిన కిమ్ కర్దాషియాన్ రొనాల్డోతో కలిసి 2010 లో డేటింగ్ చేసినట్లు కనుగొనబడింది, ఆ సమయంలో ఇద్దరు సెలబ్రిటీలు గాఢంగా ప్రేమలో ఉన్నారు. ఈమే ప్రస్తుతం కూడా సినిమాల్లో నటిస్తోంది.
రష్యన్ బ్యూటీ, టాప్ మోడల్ ఇరినా షేక్ 2010 నుంచి 2014 మధ్య డేటింగ్ చేశాడు. అయితే అకస్మాత్తుగా ఈ జంట విడిపోయారు. ఆరు నెలల తర్వాత రష్యన్ మోడల్ ఇరీనా షేక్ క్రిస్టియానో రొనాల్డో తనను మోసం చేశాడని ఆరోపించింది.
పోర్చుగీస్ కు చెందిన స్టన్నింగ్ నటి అయిన రీటా పెరీరా 2014 లో రోనాల్డోతో ప్రేమలో పడింది. ఆ తర్వాత విడిపోయారు.
బ్రెజిలియన్ మోడల్, రియాలిటీ టెలివిజన్ మోడల్ అయిన ఆండ్రెస్సా క్రిస్టియానో రొనాల్డోతో కలిసి సహజీవనం చేసింది. రష్యన్ బ్యూటీ ఇరినా షేక్‌తో రిలేషన్ లో ఉన్న సమయం 2013లోనే ఆండ్రెస్సాతో రోనాల్డో డేటింగ్ చేశాడు.
జార్జినా రోడ్రిగ్జ్.. ఇమే ఓ మోడల్.. క్రిస్టియానో రొనాల్డో తో కలిసి డేటింగ్ చేసింది. వీరిద్దరి మధ్య సంబంధం బలపడటంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం విరిద్దరూ.. భార్య భర్తలు గా కొనసాగుతున్నారు.