ఈ ఆకుకూరలు తింటే ఎన్నో బెనిఫిట్స్..
మన శరీరంలో విటమిన్స్ లోపం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.
వాటిని నివారించేందుకు ఈ ఆకు కూరలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
కరివేపాకు షుగర్‌ను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. కళ్లు బాగా కనిపడేలా చేస్తుంది.
మునగాకులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, కాపర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించి ఎముకలను బలపరుస్తుంది.
తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు, అనేక పోషకాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్‌ని నివారిస్తుంది.
పాలకూరలో విటమిన్ సి, ఎ, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను నివారించడానికి ఉపయోగపడతాయి.
ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్‌ను అదుపు చేయడానికి పాలకూర సుగుణాలు ఉపయోగ పడతాయి. గుండె వ్యాధులను కూడా పాలకూర అరికడుతుంది.