పరగడుపున బెల్లం తినడం వల్ల ఎన్ని లాభాలో...

పొద్దున్నే బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
కానీ ఇప్పుడు చలికాలం కాబట్టి దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయనే సందేహాలు ఉంటాయి.
అయితే బెల్లం ఏ సీజన్‌లోనైనా తినవచ్చు. కాబట్టి శీతాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ బారిన పడకూడదంటే బెల్లాన్ని తినాల్సిందే.  
పరగడుపున బెల్లం తింటే గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
ఖాళీ కడుపుతో బెల్లం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఉపశమనం పొందవచ్చు.
బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటాయి కాబట్టి యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
రోజూ బెల్లం తినడంతో ఐరన్ లోపం పోతుంది. అదేవిధంగా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.