పరగడుపున ఖర్జూరాలు తింటే.. రోగాలన్నీ పరార్!
చిన్నా పెద్ద ఎంతో ఇష్టంగా తినే ఖర్జూరం ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇవి ఎప్పుడైనా మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి.
ముఖ్యంగా వీటిని రాత్రి ఒక 5 తీసుకుని నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తింటే అనారోగ్య సమస్యలన్నీ పరార్ అవుతాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చలికాలంలో ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పులతో బాధపడే మహిళలు తప్పనిసరిగా ప్రతిరోజూ ఖర్జూరం తినాలి. అలాగే వీటిని తినడం వల్ల గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు రావు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఇందులోని ప్రొటీన్లు, పీచు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ కె శరీరానికి శక్తిని అందిస్తాయి. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి.
కర్జూరం తినడం వల్ల.. కంటి, కడుపుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
మధుమేహం, అల్జీమర్స్ వంటి వాటితో బాధపడేవారు వీటిని కచ్చితంగా తినాలి.
ఖర్జూరం పలు రకాల క్యాన్సర్లను రాకుండా చేయడంతోపాటు పలు ప్రమాదకర సమస్యలను తరిమికొడతాయి.