మొలకెత్తిన శనగలు, బెల్లం కలిపి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మన శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ పర్సంటేజ్ తగ్గడం వలన ఎనీమియా (రక్తహీనత) బారిన పడతాం.
ఎనీమియాతో బాధపడేవారికి మొలకెత్తిన శనగలు, బెల్లం చక్కటి పరిష్కారం.
మొలకెత్తిన శనగల్లో ప్రోటీన్స్, విటమిన్స్, బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి.
ఈ రెండిటిని కలిపి తినడం వలన హిమోగ్లోబిన్ శాతం వృద్ధి చెందుతుంది.
వీటిలోని కాల్షియం ఎముకలు, పళ్ళను బలంగా చేస్తుంది.
ఈ రెండూ తినడం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ దరిచేరవు. బీపీ అదుపులో ఉంటుంది.
మొలకెత్తిన శనగల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి అజీర్తి సమస్యల్ని దూరం చేస్తుంది.