తస్మాత్ జాగ్రత్త.. ఫ్రిజ్‌లో తరిగిన ఉల్లిపాయలు పెడుతున్నారా?
సాధారణంగా ఫ్రిజ్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని, తాజా కూరగాయలు, పండ్లు లాంటివి పెడుతుంటారు.
అయితే పలు కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచకూడదని, అవి విషతుల్యం అయ్యే చాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
ముఖ్యంగా చాలా మంది ఉల్లిపాయలను తరిగి ఫ్రిజ్‌లో పెడతారు. కానీ ఇలా చేయడం అత్యంత ప్రమాదకరం
తరిగిన ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
తర్వాత వీటిని తింటే అనేక అనారోగ్య సమస్యలు బారిన పడుతారు.
అలాతే దుర్వాసన వస్తుంది. ఆ స్మెల్ రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ఇతర ఆహార పదార్థాలకు కూడా వ్యాపిస్తుంది. వాటి తేమ శాతం పెరుగుతుంది.
ఉల్లిపాయ క్రిస్పీనెస్ పోతుంది. ఉల్లిలో పోషకాల స్థాయి కూడా తగ్గుతుంది. ఇవి బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతాయి.
ఉల్లిపాయ తొక్కలను కూడా కత్తిరించి ఫ్రిజ్‌లో ఉంచకూడదు.
అలాగే ఉల్లిపాయలు కోసినప్పుడు రకరకాల రసాయనాలు రిలీజ్ అవుతాయి. అవి బ్యాక్టీరియాను ఆకర్షించే పోషకాలుగా మారి, వాటి పెరుగుదలకు కారణమవుతాయి.