అతిగా ఆలోచిస్తున్నారా..!! అయితే ఈ ప్రమాదాలు తప్పవు

ప్రతి జీవికి ఆలోచన అనేది ఉంటుంది. కానీ అది ఒక పరిమితి వరకే ఉండాలి. శృతి మించితే అనారోగ్యాలకు దారి తీస్తుంది.
శరీర బలహీనత: అతిగా ఆలోచించడం వల్ల దాని యొక్క ప్రభావం ఆరోగ్యంపై పడి.. రోజురోజుకు శరీరాన్ని బలహీనపరుస్తుంది.
మానసిక ప్రభావం: ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దాంతో మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
మన బుర్రలో ఆలోచనలు పెరిగిపోతే.. అతి చిన్న వయసులోనే బీపీ, డిప్రెషన్, షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అంతే కాకుండా ఎక్కువగా ఆలోచించేవారు నిద్రకు, తిండికి దూరం అవుతారు. దీంతో గ్యాస్ట్రిక్, గుండె సమస్యలు ఆవహిస్తాయి.
ఈ ఆలోచనల కారణంగా జీర్ణసంబంధిత వ్యాధులు ఏర్పడి.. శరీరంలో కొవ్వు పెరిగి అధిక బరువుకు కారణం అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు.