పొద్దున సమయంలో నిద్ర పోతున్నారా..! మీ లివర్‌పై ఎఫెక్ట్
మనం నిత్యం చేసే కొన్ని పొరపాట్ల కారణంగా హెల్త్‌పై ఎఫెక్ట్ పడుతుంది.
మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం లివర్. ఇది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
కానీ, లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రోజువారీ అలవాట్లకు దూరంగా ఉండాలి అంటున్నారు నిపుణులు.. అవేంటో తెలుసుకుందాం..
కొంతమందికి పగటి పూట పడుకునే అలవాటు ఉంటుంది. అయితే.. 10, 20 నిమిషాల నిద్ర మంచిదే అయినప్పటికీ అతి నిద్ర లివర్‌కు హానికరమని నిపుణులు చెబుతున్నారు.
అయితే.. కొంత మంది లేట్ నైట్ వర్క్, పార్టీలు, లేక ఏదో కారణంగా నిద్ర పోకుండా ఉంటారు. దీని కారణంగా కూడా లివర్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది.
ప్రతి మనిషికి కోపం అనేది సాధారణం. కానీ, అతి కోపం అత్యంత ప్రమాదకరం. ఇది మానసిక ఒత్తిడిని పెంచడంతో పాటు.. కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుందట.
కాలేయ ఆరోగ్యానికే కాదు.. మనిషి ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు సరైన నిద్ర ఎంతో ముఖ్యమని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.
పైన తెలిపిన అంశాలు ఆరోగ్య నిపుణుల అభిప్రాయాల మేరకు చెప్పినవి మాత్రమే..