బొగ్గులపై కాల్చిన మొక్కజొన్న కంకులు తింటున్నారా.. అయితే క్యాన్సర్ వచ్చినట్లే..?

మొక్కజొన్న కంకులను ఇష్టపడని వారు ఉండరు. చిన్న, పెద్ద ఇష్టంగా తింటుంటారు.
రోడ్డు మీద ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. కొన్ని చోట్ల ఉడకబెట్టినవి అమ్ముతారు. మరికొన్ని చోట్ల బొగ్గుల మీద కాల్చినవి విక్రయిస్తారు.
అయితే ఉడకబెట్టిన మొక్కజొన్న కంకులు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ తక్కువ నీటిలో ఉడక బెట్టుకోవాలి
కాల్చిన కంకులు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 25 శాతం ఉంటుంది అంటున్నారు నిపుణులు
బొగ్గులపై పొత్తులు కాల్చినప్పుడు అవి బాగా కాలిపోయి అందులో ఉండే విటమిన్స్ కూడా నశిస్తాయి. అంతే కాకుండా క్యాన్సర్ కారకాలు కూడా పెరుగుతాయట.
బొగ్గులపై కాల్చినప్పుడు వాటి నుంచి వచ్చే పొగ కూడా నేరుగా పొత్తులకు పడుతుంది. కాబట్టి వాటిని తినకుండా ఉండటమే మంచిది అంటున్నారు వైద్యులు.
ఒకవేళ కాల్చిన పొత్తులు తినాలి అనుకుంటే మాత్రం మాడకుండా లైట్‌గా కాల్చుకుని తినడం బెటర్ అంటున్నారు నిపుణులు.