తలనొప్పులు ఇన్ని రకాలు ఉంటాయా..? మీకు వచ్చింది ఏ రకం నొప్పి..?
తలనొప్పి రావడం సహజం. కానీ అది ఒక్కొక్కరిని ఒక్కో విధంగా బాధిస్తుంది. తల నొప్పుల్లో ఏది ప్రమాదకరం.. ఏ నొప్పి దేనికి సంకేతమో తెలుసుకుందాం
తల పై భాగంలో విపరీతమైన తలనొప్పి వస్తే.. శరీరంలో శక్తి లేకపోవడం లేదా బాడీ డీహైడ్రేషన్ బారిన పడిందని గుర్తించాలి. దీనికి గురైన వాళ్లు పుష్టిగా ఆహారం తినడంతోపాటు వాటర్ బాగా తాగాలి
కొంత మందికి నుదిటి భాగంలో కత్తులతో పొడుస్తున్నంత నొప్పి వస్తుంటుంది. ఇది నిద్రలేమికి సంకేతం. ఈ రకమైన తలనొప్పి తగ్గాలంటే రోజుకు 6 నుండి 8 గంటల నిద్ర అవసరం
కొన్ని సార్లు తల వెనుక భాగంలో నొప్పి వస్తుంది. దీనికి సంకేతం మీరు ఒత్తిడికి గురవుతున్నారని అర్థం. దీనికి నివారణ ఏ ఆలోచనలు, ఒత్తిడి పెట్టుకోకుండా రోజు ధ్యానం చేయడం
తల నొప్పి తీవ్రత: కొందరికి నుదిటి చుట్టు విపరీతమైన తలనొప్పి వస్తుంటుంది. దీనికి కారణం మీరు ఎక్కువగా కంప్యూటర్, ఫోన్స్ లాంటివి చూస్తున్నారని అర్థం. ఎలక్ట్రానిక్ వస్తువులు చూసేటప్పుడు బ్లూ-రే బ్లాకర్ అద్దాలు పెట్టుకుంటే మంచిది
కొంత మందికి కళ్లు, ముక్కు, చెవుల చుట్టు విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఇది అలుర్జీ లేదా సైనస్ సమస్య వల్ల కావచ్చు. దీనికి తగ్గించుకునేందుకు మెడిసిన్స్ ఉపయోగించుకోవచ్చు. వ్యాయామం చేసిన మంచి ఫలితం ఉంటుంది
NOTE: తలనొప్పి తీవ్రత అధికమైతే మాత్రం డాక్టర్స్‌ను సంప్రదించడం మంచిది