బాదం పొట్టేకదా అని పారేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

చాలా మంది బాదం తినేటప్పుడు దానిపై ఉన్న పొట్టును తీసేస్తారు. కానీ ఆ పొట్టులోనే ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
బాదం పొట్టులో ఫైబర్, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పొట్టును ఎండబెట్టి పొడి చేసుకుని రోజుకు ఒక టీ స్పూన్ పొడిని స్మూతీల్లో కలిపి తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
బాదం పొట్టుని పొడి చేసి తేనె, కొబ్బరి నూనె లేదా రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్ చేసుకుని, ఈ పేస్ట్‌ను ముఖానికి మర్దన చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.
బాదం పొట్టుని నీటిలో వేసి మరిగించి వడకట్టి తేనె, దాల్చిన చెక్క లేదా అల్లం ముక్కతో కలిపి టీలా తాగొచ్చు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరం వేడి తగ్గుతుంది.
బాదం పొట్టును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది.
బాదం పొట్టును నీటితో మరిగించి పేస్ట్‌లా చేసి సూప్‌లు, సాస్‌లు, స్ట్యూస్‌లో కలిపితే రుచి పెరుగుతుంది. అలాగే ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం కూడా అందుతాయి.
టమాటా, గుమ్మడికాయ లేదా కాలీఫ్లవర్ వంటి క్రీమీ సూప్‌లలో ఈ పేస్ట్‌ను కలిపితే ప్రత్యేకమైన రుచి వస్తుంది.
బాదం పొట్టుని చిన్న ముక్కలుగా చేసి ఇతర కూరగాయల వ్యర్థాలతో కలిపి ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఈ సహజ ఎరువును నేలలో వేస్తే మొక్కలకు పోషకాలు అందుతాయి.