ఈమె 1924 అక్టోబర్ 28న ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణారావుపురంలో జన్మించారు
తెరపై సూర్యకాంతం కనిపించగానే ఎంతో మంది కోడళ్లకు వణుకు పుట్టేది.
తెరపై ఆమె పోషించిన ప్రతి పాత్రలో హాస్యం, వ్యంగ్యం, గడుసుతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. పాత్ర ఏదైనా అందులో స్వాభావికంగా నటించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య
గుండమ్మ కథలో గుండమ్మగా, మాయాబజార్ లో హిడింబిగా మెప్పించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది
సూర్యకాంతం నటించిన ‘‘సంసారం’’ చిత్రంలో ఆమె నట తన జీవితాన్నే మలుపు తిప్పింది. ఈ సినిమాలో గయ్యాళి అత్త పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు.
ఎక్కువ గయ్యాళి పాత్రల్లో కనిపించడం వలన ఆమెకు గయ్యాళి అనేది పర్యాయపదంగా నిలిచింది.
ఆ రోజుల్లో తెలుగునాట సూర్యకాంతంపై అభిమానం ఉన్న వారు సైతం, తమ పిల్లలకు సూర్యకాంతం అన్న పేరు పెట్టుకోవడానికి జంకేవారు అంటే ఆమె అభినయం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.