ప్రేమికులు, దంపతులు లేదా ఫ్రెండ్స్ పెట్టుకునే ముద్దులు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి.
ముఖ్యంగా ‘హికీ’ లేదా ‘లవ్ బైట్’గా పిలుచుకునే ముద్దు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అంతేకాదు కాదు నిరంతరం పార్ట్‌నర్‌తో రొమాన్స్ ఇష్టపడే వారిని భయాందోళనకు గురిచేస్తుంది.
ఇటీవలే మెక్సికో నగరానికి చెందిన 17 ఏళ్ల జూలియో మాకియాస్ గొంజాలెజ్ అనే యువకుడి మరణానికి కారణమైంది.
‘హికీ’ లేదా ‘లవ్ బైట్’ అంటే శరీరంపై పెదాలతో గట్టిగా అదిమిపెట్టి పీల్చడం.
ప్రేమికులు చాలామంది చెవి లేదా మెడ భాగాల్లో తరచు ఇలాగే చేస్తుంటారు.
ప్రాథమికంగా ఒక వ్యక్తి మరొకరి చర్మాన్ని పీల్చినప్పుడు లేదా కొరికినప్పుడు రక్తనాళం పగిలిపోయి చర్మంపై ఎర్రటి గాయం వలె ఏర్పడుతుంది.
జూలియో విషయంలో అతని ప్రియురాలు ఓ సాయంత్రం డీప్ మూడ్‌లో ఉన్నపుడు అతనికి హికీ ఇచ్చింది.
దీంతో రక్తం గడ్డకట్టి బ్రెయిన్ స్ట్రోక్‌తో జూలియో ప్రాణాలు కోల్పోయాడు.
అయితే ఇదే మొదటి కేసు కాదు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక న్యూజిలాండ్ మహిళను తన భాగస్వామి మొడపై ముద్దుపెట్టి గట్టిగా పీల్చినప్పుడు ఆ ప్లేసులోనే రక్తం గడ్డకట్టి ఆమె ఎడమ చేయి పక్షవాతానికి దారితీసింది.
అందుకే ప్రేమ పక్షులారా ముద్దుల విషయంలోనూ సురక్షితంగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.