మూడు నెలలుగా ఒక్క జననం కూడా లేని దేశం.. కారణమేంటో తెలిస్తే షాక్!
ప్రపంచమంతా నిత్యం జననాలు, మరణాలు సంభవించడం కామన్. ఇటీవల కాలంలో ఎక్కువగా మరణాలే చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కొన్ని దేశాల్లో అధిక మరణాలు చోటుచేసుకుంటే.. మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం జననాల రేటు పెరిగి జనాభ శాతం కూడా పెరుగుతుంది.
అయితే ప్రపంచం మొత్తం మీద ఇటలీలో మూడు నెలలుగా ఏ ఒక్క శిశువు కూడా జన్మించలేదట. ఇక్కడ 5 కోట్ల జనాభా కలిగి ఉందట.
చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ సహా పలు దేశాల్లో జననాల సంఖ్య తగ్గిపోతుంది.
నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో ISTAT డేటా ప్రకారం.. ఇటలీలో మూడు నెలల పాటు ఒక్క బిడ్డ కూడా పుట్టలేదని సమాచారం.
అయితే నివేదికల ప్రకారం.. జననాల రేటు తగ్గడానికి ప్రధాన కారణం.. 15 నుంచి 49 ఏళ్ల వయస్సు గల స్త్రీలు లేకపోవడమేనట.
పురాతన దేశాల్లో ఒకటైన ఇటలీ వృద్దాప్యం వైపుకు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది.