ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌తో గాలిలో వైరస్‌లకు చెక్

33
air purifier

దిశ, ఫీచర్స్: కొవిడ్ మహమ్మారిని నిరోధించే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఓ వైపు కొనసాగుతుండగా.. మరోవైపు కొత్త స్ట్రెయిన్‌ కేసులు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాను ఈ కొత్త వైరస్ కేసులు కలవరపెడుతుండగా, ఇటీవల జపాన్‌లోనూ న్యూ వేరియంట్‌ కారణంగా పలు కేసులు నమోదయ్యాయి. ఇక భారత్‌లో కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కేసులు, పలు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతుండటం గమనార్హం. దీంతో కేంద్ర, రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. మాస్క్ ధరించడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని కోరుతున్నాయి. ఈ క్రమంలో వైరస్ కట్టడి నిమిత్తం ఇప్పటికే పలు ఆవిష్కరణలు (పరికరాలు) చేసిన ఉత్తర ఐరోపా, ఇస్టోనియాకు చెందిన రెస్పిరే సంస్థ.. గాలిలో వైరస్‌లు చంపేందుకు ఓ కొత్త పరికరాన్ని రూపొందించింది.

ఈ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ధరించి గాలి పీల్చినట్టయితే, మనం పీల్చిన గాలిలోని 99 % వైరస్‌, బ్యాక్టీరియాలను ఈ ఇన్‌స్ట్రుమెంట్ రిలీజ్ చేసే అల్ట్రావైలెట్ లైట్(యూవీ) చంపుతుంది. కాగా ఇస్టోనియా, పోలాండ్ దేశాల యూనివర్సిటీలు, ఇస్టోనియా ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సహకారంతో ఈ డివైజ్ తయారు చేసినట్లు రెస్పిరే సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ పరికరాన్ని మొదట ఆ దేశంలోని పాఠశాల ఉపాధ్యాయులకు అందించనున్నారు. ఈ డివైజ్‌ను మెడకు(మెడ చుట్టూ) ధరించేందుకు వీలుగా ఉండేలా ప్లాస్టిక్ మెటీరియల్‌, ఫేస్ స్క్రీన్‌తో రూపొందించారు. దీన్ని బ్యాటరీ ద్వారా కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని ధరించిన వ్యక్తి.. గాలి పీల్చినప్పుడు అందులోని వైరస్, బ్యాక్టీరియా ముఖం వద్దకు చేరుకునే లోపే డివైజ్‌లోని యూవీసీ లెడ్ మాడ్యుల్(UV-C LED) సంహరిస్తుందని, దీన్ని పోలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లాడ్జ్‌లో టెస్ట్ చేశామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..