నిత్యావస‌ర స‌రుకులు అందించిన కార్పొరేట‌ర్ ప‌ద్మావ‌తి..

17

దిశ‌, గండిపేట్ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడ‌వ డివిజన్ లో మున్సిపల్ కార్మికుల స‌మ‌స్యల ప‌రిష్కారానికి కృషి చేయ‌డం జ‌రుగుతుంద‌ని కార్పొరేట‌ర్ ప‌ద్మావ‌తి పాప‌య్య యాద‌వ్ అన్నారు. దసరా పండుగను పుర‌స్కరించుకొని నిత్యవసర సరుకులను కార్పొరేట‌ర్‌ పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ మాట్లాడుతూ.. త‌న వార్డులో మున్సిప‌ల్ సిబ్బందికి అండ‌గా ఉంటామ‌న్నారు. వారికి ఎలాంటి స‌మ‌స్యలు ఉన్నా త‌మ దృష్టికి తీసుకురావాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో నదిం, ఉస్మాన్, రాజు యాదవ్‌, భురాన్, సావిత్రి, అబుభకర్, కాలనీ వాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..