పానుగల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం : ఎం ఏ రషీద్

by  |
PANUGAL FORT
X

దిశ, వనపర్తి : వనపర్తి జిల్లా పురాతన కట్టడాలకు నిలయమైన పానుగల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లా అధికారులు బృందం సోమవారం పాన్‌గల్ ఖిల్లాను సందర్శించారు. ఖిల్లాపై ఉన్న పురాతన కట్టడాలను, శిల్పాలను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న చారిత్రాత్మక కట్టడాలను మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. ఖిల్లాపై ఉన్న ముండ్ల గవిని, మక్కా మసీదు, రామగుండం, సీత గుండం, చిన్న ఖిల్లా, పెద్ద ఖిల్లా, సీతారామ పాదాలు, ఫిరంగులు, ఖిల్లా చుట్టూ ఉన్న కందకాలు, ముఖద్వారాలు, తదితర వాటిని పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాష్మీన్ ఆదేశాల మేరకు ఖిల్లాను సందర్శించామని తెలిపారు.

చారిత్రాత్మక కట్టడాలకు పునర్జీవం పోస్తామని జిల్లా టూరిజం అధికారి ఎం. ఏ. రషీద్ అన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని అధికారుల బృందం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు మునీరుద్దీన్, టూరిజం అధికారి యం. ఎ. రషీద్, పీఆర్ఏఈ మల్లయ్య, ప్రత్యేక అధికారి సురేష్, డీఈ చెన్నయ్య, ఏఈ సత్తయ్య, తహశీల్దార్ చక్రపాణి, ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి, ఆర్ఐ మహేష్, సర్పంచ్ గోపాల్ రెడ్డి, గ్రామ ప్రముఖులు రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed